ఈ ఏడాది రాఖీ చాలా ప్రత్యేకం.. అయిదేళ్ల తర్వాత..: ప్రియాంక చోప్రా

24 Aug, 2021 18:25 IST|Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా ఈ రక్షాబంధన్‌ ఎంతో ప్రత్యేకమని చెప్పింది. బాలీవుడ్‌లో అగ్రనటిగా కొనసాగిన ప్రియాంక చోప్రా గత కొన్నాళ్లుగా హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018లో అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌తో వివాహం అనంతరం ప్రియాంక అక్కడే సెటిలైపోయింది. అక్కడే హాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్స్‌ చేస్తూ బిజీగా మారింది.  ఇక నిన్న జరిగిన రక్షాబంధన్ ఆమెకు చాలా ప్రత్యేకంగా నిలిచిందంటూ సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రాతో కలసి ఐదేళ్ల తర్వాత ఆమె రక్షాబంధన్ పండుగ జరుపుకున్నట్లు ఆమె పేర్కొంది.

చదవండి: మేయర్‌ అభ్యర్థిగా సోనూసూద్‌.. క్లారిటీ ఇచ్చిన ‘రియల్‌ హీరో’!

ఇస్టాగ్రామ్‌లో తన సోదరుడు సిద్ధార్థ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఈ ఏడాది రక్షాబంధన్‌ నాకు చాలా ప్రత్యేకంగా నిలిచింది. అయిదేళ్ల తర్వాత నా తమ్ముడికి రాఖీ కట్టాను. నా ఆర్మీలోని సోదరులందరికీ హ్యాపీ రాఖీ’ అంటూ విషెస్ తెలిపింది. మీరందరూ ఎక్కడ ఉన్నా ప్రేమాభిమానాలను, రాఖీలను పంపుతున్నానని, త్వరగా రాఖీ కానుకలు వస్తాయని ఆశిస్తున్నానని పేర్కొంది. ప్రస్తుతం ప్రియాంక లండన్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ తన తాజా సిరీస్ ‘సైటడెల్’ షూటింగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు