ప్రియాంకతో పెళ్లి వచ్చే జన్మలో అయినా..

15 May, 2021 18:32 IST|Sakshi

నటుడి గురించి ఎంక్వైరీ కూడా చేసిన ప్రియాంక కుటుంబం

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతూనే హాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది నటి ప్రియాంక చోప్రా. తనకంటే పదేళ్లు చిన్నవాడైన ఆమెరికన్‌ పాప్‌ సింగర్‌ నిక్‌జోనస్‌తో ప్రేమలో పడిన ఈ భామ 2018లో అతడిని వివాహం చేసుకొని ప్రస్తుతం అమెరికాలో ఉంటోంది. తాజాగా  ప్రియాంక పెళ్లికి  సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ప్రియాంక వివాహం మొదట దేవొంకే దేవ్‌ మహదేవ్‌ అనే హిందీ సీరియల్‌ నటుడు మోహిత్‌ రైనాతో చేయాలని ఆమె కుటుంబసభ్యులు భావించారట.


ఈ సీరియల్‌లో శివుడి పాత్రలో కనిపించిన మోహిత్‌ ప్రియాంకకు సరిజోడి అని ఆమె తల్లి ఫిక్సయిందట. అంతేకాకుండా అతడి గురించి ఎంకర్వ్యైరీ కూడా చేసి ఎంతో మంచివాడని, మోహిత్‌తోనే ప్రియంకకు పెళ్లి జరిపించాలని అనుకున్నారట. దీనికి సంబంధించిన వార్త మీడియాలో అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని మోహిత్‌తో ప్రస్తావించగా..ప్రియాంక అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెను సూపర్‌ స్టార్‌ అని కొనియాడారు.


తాను కేవలం టెలివిజన్‌ నటుడిని అని,  అయినా తన గురించి ప్రియాంక పేరేంట్స్‌ ఇలా ఆలోచించడం చాలా గొప్పవిషయమని అన్నారు. అయితే తనలాంటి చిన్న వ్యక్తితో ప్రియాంక పెళ్లి ఈ జన్మలో జరగకపోయినా, వచ్చే జన్మలో అయినా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇదిలా వుంటే ఈ ఏడాది ప్రియాంక బోలెడు ప్రాజెక్టులకు సంతకం చేసింది. అందులో టెక్స్ట్‌ ఫర్‌ యూ చిత్రాన్ని ఇదివరకే కంప్లీట్‌ చేయగా మరికొన్ని షూటింగ్‌ దశలో ఉన్నాయి.  ‘సిటాడెల్‌’ అనే అమెజాన్‌ సిరీస్‌తో పాటు ‘మ్యాట్రిక్స్‌ 4’లోనూ నటిస్తోంది. ఇక ఈ మధ్యే న్యూయార్క్‌లో సోనా అనే రెస్టారెంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

చదవండి : ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్‌లు రాలేదు : మీరా చోప్రా
అవును ఒప్పుకుంటున్న, నా వయసైపోతుంది: ప్రియాంక

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు