'ప్రభుదేవాతో గొడవలు'..క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఎంఎస్‌ రాజు

24 May, 2021 20:55 IST|Sakshi

వెంకటేశ్‌ హీరోగా వచ్చిన ‘శత్రువు’ సినిమాతో నిర్మాగా మారారు ఎంఎస్‌ రాజు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ఆ తర్వాత ఎన్నో హిట్‌ చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను నిర్మించారు. ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన చిత్రం పౌర్ణమి. ఈ చిత్రాన్ని కూడా ఎంఎస్‌ రాజునే నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఆ సమయంలో డైరెక్టర్‌ ప్రభుదేవాకు, ఎంఎస్‌ రాజుకు మధ్య గొడవలు వచ్చాయని, ప్రభాస్‌ దీన్ని సద్దుమణిగించారని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్‌ రాజు క్లారిటీ ఇచ్చారు. 'ప్రభుదేవాకు నాకు చాలా గొడవలు అయ్యాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు. నిజానికి ప్రభుదేవా మంచి పొజిషన్‌లో ఉన్నాడని సంతోషిస్తాను కానీ అతనితో నాకు గొడవలు ఎందుకు ఉంటాయి? ఇది కేవలం పుకార్లు మాత్రమే' అని వివరించారు. ఇక నిర్మాతగా ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాను అందించిన  ఎంఎస్‌ రాజు కొంతం గ్యాప్‌ తర్వాత దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఆయన తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వైల్డ్‌ హనీ ప్రొడక్షన్‌ పతాకంపై ‘7 డేస్‌ 6 నైట్స్‌’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుందని పేర్కొన్నారు. 

చదవండి : మెగాస్టార్‌ చిరంజీవికి చెల్లిగా అనుష్క నటించనుందా?
Karnataka: సీఎం కావాలని ఉంది: ఉపేంద్ర

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు