Rakesh Master Death: రాకేశ్ మాస్టర్ ఫ్యామిలీ మంచి మనసు.. వాటిని దానం చేసి!

19 Jun, 2023 12:12 IST|Sakshi

ప‍్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో సడన్ గా చనిపోయారు. ఒకప్పటి జనరేషన్ కు డ్యాన్స్ మాస్టర్ గా తెలిసిన ఆయన.. ఇప్పటి జనరేషన్ కి మాత్రం యూట్యూబ్ వీడియోలతో బాగా పరిచయం. పలు ఫన్నీ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో చాలామంది హ్యాపీనెస్ కు కారణమయ్యారు. అలాంటిది రాకేశ్ మాస్టర్ ఇలా అకస్మాత్తుగా మరణించడం ఆయన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలాంటి టైంలోనూ వాళ్లు గుండె నిబ్బరం చేసుకుని ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

తిరుపతికి చెందిన రాకేశ్ మాస్టర్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆదివారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఈయన‍్ని చేర్చారు. అలా చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో చనిపోయారు. అయితే తను చనిపోతానని కొన్నిరోజుల ముందే పసిగట్టిన రాకేశ్ మాస్టర్.. తన అవయవాల్లో పనికొచ్చే వాటిని దానం చేయాలని సూచించారట. ఈ విషయాన్ని ఆయన అసిస‍్టెంట్ సాజిద్ బయటపెట్టాడు. 

ఇదే విషయాన్ని డాక్టర్లకు చెప్పిన సాజిద్.. పోస్టుమార్టం చేసి, బాడీపార్ట్స్ తీసుకున్న తర్వాత తమకు అప్పజెప్పాలని, దహన సంస్కారాలు చేసుకుంటామని వాళ్లకు చెప్పినట్లు పేర్కొన్నాడు. ఇక చూపులేని వారికి రాకేశ్ మాస్టర్ కళ్లని దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్లు సాజిద్ క్లారిటీ ఇచ్చాడు. ఇలా తన అవయవాలని దానం చేయాలనే గొప్ప మనసు రాకేశ్ మాస్టర్ కు ఉందని తెలిసి నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.

(ఇదీ చదవండి: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. రాకేశ్‌ మాస్టర్‌ లాస్ట్ వీడియో)

మరిన్ని వార్తలు