Ram Charan: హాలీవుడ్ సినిమాకు అవార్డ్ ఇచ్చే రేంజుకు రామ్‌చరణ్‌

25 Feb, 2023 19:56 IST|Sakshi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్ళి ఐదు రోజులవుతుంది. అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అమెరికాలోని ఓ ఆలయంలో అయ్యప్ప మాల తీసిన తర్వాత 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో పాల్గొన్నారు. తర్వాత 'ఏబీసీ న్యూస్'కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అనంతరం అభిమానులతో ముచ్చటించారు. 'ఆర్ఆర్ఆర్', 'నాటు నాటు' సాంగ్, ఎస్.ఎస్. రాజమౌళి గురించి గొప్పగా చెప్పారు. బేవెర్లీ హిల్స్‌లో శనివారం ఉదయం జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లోనూ రామ్ చరణ్ సందడి చేశారు.

'ఆర్ఆర్ఆర్'కు వచ్చిన స్పాట్ లైట్ అవార్డు అందుకున్నారు. హెచ్‌సీఏ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్'కు నాలుగు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డుల వేడుకలో రామ్ చరణ్ అరుదైన ఘనత అందుకున్నారు. హెచ్‌సీఏ అవార్డుల్లో ప్రజెంటర్‌గా 'బెస్ట్ వాయిస్ / మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్'ను రామ్ చరణ్ అనౌన్స్ చేశారు. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఆయన పక్కన నిలబడటమే అవార్డ్ అని నటి ఏంజెలా చెప్పారు. హాలీవుడ్ సినిమాకు అవార్డ్ ఇచ్చే గౌరవం అందుకున్న ఏకైక హీరోగా రామ్ చరణ్ నిలిచారు.

మరిన్ని వార్తలు