Ram Gopal Varma: నేను త్వరగా చనిపోవాలి.. ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు

14 Jan, 2022 16:14 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తరచూ వివాదాలను పలకరిస్తూ ఉంటాడు. ఏ విషయంపై అయినా వ్యంగ్యంగా స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్‌ చేస్తుంటాడు. అలా ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఆర్జీవీ ఏ ఒక్కరిని వదలడు. అందరిపై ఒకేలా తన వ్యంగ్యస్త్రాలు సంధిస్తుంటాడు. అలాగే తనకు పండుగలకు పబ్బాలకు శుభాకాంక్షలు చెప్పడం కూడా నచ్చదు. నచ్చదన్న పని ఎవరూ చేయారు. కానీ అలా చెప్పినట్లుగా చేస్తే అతను ఆర్జీవి ఎందుకు అవుతాడు. అవును ఏ పండుగకు విష్‌ చేయని రామ్‌ గోపాల్‌ వర్మ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన వజ్రాయుధం ట్వీటర్‌ ద్వారా వరుస ట్వీట్లు చేస్తూ అందరికీ మేలు జరగాలని కోరాడు. 

'అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు  రావాలి. మీకు ఇప్పుడు, ఎప్పుడూ ఎలాంటి వైరస్‌ సోకకూడదు అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు, అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు దొరకాలి'. 'భర్తలను భార్యలు వేధించకూడదు. మీరు ఏం చేసినా ఏం చేయకున్నా మీతో మీ భార్యలు బాగుండాలి.' 'చిన్న సినిమా దర్శక నిర్మాతలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్‌ కావాలి.' 'నన్ను ద్వేషించే వారికోసం నేను త్వరగా చనిపోవాలి. అంటూ వరుస ట్వీట్లతో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడు ఆర్జీవీ. 
 

ఇదీ చదవండి: అందరూ పోతారు కానీ.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు