తెలంగాణ ఎన్నికలు.. కాబోయే సీఎం అంటూ ఆర్జీవీ ట్వీట్

3 Dec, 2023 15:20 IST|Sakshi

తెలంగాణ ఎన్నికలపై సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ గెలవడంపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అభినందనలు తెలిపారు. రేవంత్ వల్లే కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ పెరిగిందన్నారు.  తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అంటూ పోస్ట్ చేశారు. నవంబర్‌ 30న జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్  విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 

మరిన్ని వార్తలు