చెర్రీ బర్త్‌డే: మరో సినిమా అప్‌డేట్‌ కూడా వచ్చేసింది

28 Mar, 2021 11:09 IST|Sakshi

మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినీఇండస్ట్రీ నుంచి విషెస్‌ వెల్లువెత్తుతుండడంతో పాటు తన సినిమాలకు సంబంధించి పలు ఆసక్తికర అప్‌డేట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి రామరాజ్‌ పోస్టర్‌ .. ‘ఆచార్య’ నుంచి సిద్ధ పోస్టర్‌ లాంటి సాలిడ్ అప్‌డేట్స్‌ వచ్చాయి. ఇదిలాఉండగా.. చరణ్‌ చేసిన సినిమాల్లో నటనపరంగా మరో మెట్టు ఎక్కించిన సినిమా ‘రంగస్థలం’ అని తెలిసిందే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌రణ్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిందీ  చిత్రం. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్కిన రంగస్థలం చ‌ర‌ణ్‌కు న‌టుడిగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చిపెట్టింది.

చెవిటి వ్యక్తిగా రామ్ చ‌ర‌ణ్ అద్భుత న‌టనా ప‌టిమ క‌న‌బ‌రిచాడు. ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచి నాన్‌ బాహుబలి రికార్డులను కూడా సొంతం చేసుకుంది. తాజాగా రామ్‌ చరణ్ ‘రంగస్థలం’ తమిళ డబ్‌ వెర్షన్‌ విడుదల ఎప్పుడన్నది కూడా తెలిసిపోయింది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ క్లారిటీనిస్తూ ట్విటర్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాను తమిళ వెర్షన్‌లో విడుదల చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు రావడంతో వచ్చే మే నెలలో ముహూర్త ఖరారు చేసినట్టు నిర్మాతలు కన్ఫార్మ్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా తమ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. మరి చెర్రీ సుకుమార్ ల కాంబినేషన్‌లో వచ్చిన ఈ వింటేజ్ వండర్ తమిళంలో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి. 

 ( చదవండి: సైరాకుఏడాది పూర్తి, రామ్‌చరణ్‌ ట్వీట్‌ ) 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు