రవితేజ సినిమాకు ఇలాంటి కష్టాలా.. నో ఛాన్స్‌

24 Nov, 2023 07:55 IST|Sakshi

డాన్‌ శీను, బలుపు, క్రాక్‌ ఈ హిట్‌ సినిమాలన్నీ రవితేజ - గోపీచంద్‌ మలినేని కలయికలో వచ్చినవే... ఇంతటి క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌ ఆగుతారా..? అందుకే ఈ కాంబోపై భారీ అంచనాలు పెట్టుకున్నారు రవితేజ ఫ్యాన్స్‌.. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్‌తోపాటు ఇందుజ రవిచంద్రన్‌ కీలక పాత్రల్ని పోషిస్తున్నారని కూడా మేకర్స్‌ ప్రకటించారు.

కె.రాఘవేంద్రరావు ఈ సినిమాకు గౌరవ దర్శకత్వం వహిస్తే... ఆ సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్‌ క్లాప్‌నిచ్చారు. ఇలా ఎంతో ​ క్రేజీగా ప్రారంభం అయిన ఈ ప్రాజెక్ట్‌పై పలు రూమర్స్‌ వస్తున్నాయి. బడ్జెట్‌ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ బడ్జెట్‌ భారీగా పెరిగిపోతుందని.. ఈ విషయంలో మేకర్స్‌ మరోసారి  లెక్కలు వేస్తున్నారట. మార్కెట్ లెక్కలకి, సినిమాకి అనుకున్న బడ్జట్‌కు మధ్య చాలా డిఫరెన్స్ ఉండడంతో ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా ఆపేయాలని చూస్తున్నారట.

సమాజంలో జరిగిన నిజ జీవితాల సంఘటనలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌ అవుతుందని టాక్‌. దీంతో రిస్క్‌ చేయడం ఎదుకని చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ ప్రచారంలో ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. రవితేజ ఇప్పటికే వరుసగా రెండు చిత్రాలు రూ. 100 కోట్ల కలెక్షన్స్‌ మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్‌ లాంటి బిగ్‌ ప్రొడక్షన్ భాగస్వామ్యం కావడం విశేషం. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌ సినిమాకు మార్కెట్‌,బడ్జెట్‌ కష్టాలు అనేవి ఉండకపోవచ్చు. 

మరిన్ని వార్తలు