Ravi Teja: ఫ్లాప్‌ అయితే రెమ్యునరేషన్‌లో కొంత వెనక్కిచ్చేస్తా

2 Jan, 2022 14:04 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. ఈయన హోస్ట్‌ ఏంటి? అని వ్యంగ్యంగా మాట్లాడినవాళ్లతోనే ఇది కదా హోస్టింగ్‌ అని పొగిడేలా షోను రఫ్ఫాడించాడు బాలయ్య. ఈ కార్యక్రమానికి వచ్చే హీరోలను కలుపుకుపోతూ, సరదాగా మాట్లాడుతూ, ఆటలు ఆడిస్తూ, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబడుతూ అదిరిందయ్యా బాలయ్య అనిపించుకున్నాడు. డిసెంబర్‌ 31న ప్రసారమైన అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌కి మాస్‌ మహారాజ రవితేజ అతిథిగా విచ్చేశాడు.

ఈ ఎపిసోడ్‌లో బాలయ్యకు తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవని కుండ బద్ధలు కొట్టేశాడు రవితేజ. సినిమాల గురించి మాట్లాడుతూ తాను నటించిన మూవీస్‌ ఏమైనా ఫ్లాప్‌ అయితే తనకిచ్చిన రెమ్యునరేషన్‌లో కొంత భాగాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆయనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కాగా రవితేజ ప్రస్తుతం 'ఖిలాడీ', 'రామారావు ఆన్‌ డ్యూటీ', 'రావణాసుర' సినిమాలు చేస్తున్నాడు. 

మరిన్ని వార్తలు