Krishnam Raju: కృష్ణంరాజు మృతి.. ప్రముఖుల సంతాపం

11 Sep, 2022 08:08 IST|Sakshi

ప్రముఖ నటుడు రెబల్‌స్టార్‌ కృష్ణం రాజు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాని మోదీ సంతాపం
 

కృష్ణంరాజు మృతిపట్ల సీఎం జగన్‌ సంతాపం
ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఏపీ గవర్నర్‌ సంతాపం
మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటుడు  కృష్ణంరాజు ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణం రాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు గవర్నర్‌ సంతాపం తెలిపారు.

కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటు: సీఎం కేసీఆర్‌
ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో, మాజీ కేంద్రమంత్రి.. కృష్ణం రాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనా శైలితో, 'రెబల్ స్టార్'గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు.

లోక్‌సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సంతాపం
విజయవాడ: మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు మృతికి ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సంతాపం ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున  కేంద్ర మంత్రిగా సేవలందించిన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

కృష్ణంరాజు మృతికి  చంద్రబాబు సంతాపం
ప్రముఖ సినీ నటులు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తన విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు మరణం ఎంతో బాధ కలిగించిందని చంద్రబాబు అన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన సానుభూతి తెలిపారు.

టీపీసీసీ రేవంత్‌రెడ్డి సంతాపం
ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు మృతికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని.. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మహేష్‌బాబు సంతాపం

అనుష్క సంతాపం
కృష్ణం రాజు మృతిపట్ల నటి అనుష్క దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కృష్ణంరాజు మనసు  చాలా గొప్పదని, ఎప్పటికీ అందరి హృదయాల్లో జీవించి ఉంటారని పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించింది. ఈ మేరకు కృష్ణంరాజుతో కలిసి తీసుకున్న ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. 

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

 మంచు విష్ణు సంతాపం

సుబ్బి రామి రెడ్డి సంతాపం
కృష్ణంరాజు మృతి పట్ల మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కృష్ణం రాజు లేడంటే నమ్మలేక పోతున్నాను. దాదాపుగా 50 ఏళ్లుగా సన్నిహితుడు. నా సినిమాల్లో వంశోదరకుడు, గాంగ్ మాస్టర్ చిత్రాల్లో నటించాడు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ప్రభాస్ అంటే ఆయనకు చాలా ప్రేమ.  ఏన్నాఆర్‌, ఎన్టీఆర్‌ తర్వాత కృష్ణం రాజు మలీ తరం నాయకుడు. ఆయనకు ఆత్మకు శాంతి కలిగి,  కుటుంబానికి దైర్యం చేకూరాలని కోరుకుంటున్నాను’అని రామిరెడ్డి అన్నారు. 

మరిన్ని వార్తలు