సుశాంత్‌ కేసు: అలా రియా సుశాంత్‌ను వేధించింది

6 Aug, 2020 19:01 IST|Sakshi

ముంబై: దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఆదేశించాక రోజురోజుకు కీలక ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ ఇంగ్లీష్‌ ఛానల్‌ రియా ఫోన్‌ కాల్‌ డేటాను సేకరించింది. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రియా, తన కుటుంబ సభ్యులు సుశాంత్‌ను బలవంతంగా మానసిక వైద్యశాలకు పంపించాలని చూసినట్లు వెల్లడైంది. అంతేగాక సశాంత్‌కు రియా పదే పదే ఫోన్‌ చేసి వేధించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇదంతా సుశాంత్‌ జనవరి 20 నుంచి 24వ తేదీల్లో చండీఘర్‌లో తన సొదరి రాణితో ఉన్నప్పుడు జరిగింది. 5 రోజుల్లో దాదాపు 25 సార్లు రియా సుశాంత్‌కు ఫోన్‌ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గతేడాది డిసెంబర్‌లో‌ సుశాంత్‌ ఫోన్‌ నెంబర్‌ మార్చినట్లు కూడా తెలుస్తోంది. ఆ నెంబర్‌ నుంచి సుశాంత్‌ తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి రియా, తన కుటుంబ సభ్యులు తనని మానసిక వైద్యశాలలో చేర్పించేందుకు కుట్ర చేస్తున్నారని, అది తనకు ఇష్టం లేదని చెప్పి​ బాధపడినట్లు తెలుస్తోంది. (చదవండి: సుశాంత్‌ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం)

వారి వేధింపులు తట్టుకోలేక సుశాంత్‌ ముంబై వదిలి హిమాచల్‌ ప్రదేశ్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు కూడా సమాచారం. ‌ఈ క్రమంలో సుశాంత్‌  జవనరి 2020లో చండీఘర్‌లోని తన సోదరి రాణి ఇంటికి వెళ్లీనప్పుడు రియా పదే పదే ఫోన్‌ చేసి తన దగ్గరికి తిరిగి రవాలని, తనకు సహాయం చేయమని అడిగినట్లు తన కాల్‌ డేటాలో వెల్లడైంది. అయితే తను తప్పుడు మెడిసిన్‌ తీసుకోవడం వల్ల క్లాస్ట్రోఫోబియాతో బాధపడ్డాడని, రెండు రోజుల కోసం తన సోదరి రాణి వద్దకు వెళినట్లు సమాచారం. ఇటీవల రియా, తన కుటుంబ సభ్యులు సుశాంత్‌ను మానసికంగా వేధించారని, ఆత్మహత్యకు ప్రేరేపించాలే వారు సుశాంత్‌తో‌ ప్రవర్తించినట్లు సుశాంత్‌ తం‍డ్రి కేకే సింగ్‌ బీహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక రియా సుశాంత్‌ నుంచి 15 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నట్లు కూడా ఆయన ఆరోపించారు. (చదవండి: సుశాంత్‌ మృతిపై  సీబీఐ విచారణ)

మరిన్ని వార్తలు