Salman Khan: ‘అంతిమ్‌’ ట్రైలర్‌ విడుదల.. బావ మరుదుల సవాల్‌ అదిరిందిగా..

26 Oct, 2021 11:43 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, ఆయన చెల్లెలు అర్పితా ఖాన్‌ భర్త ఆయుష్మాన్‌ శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అంతిమ్‌: ది ఫైనల్‌ ట్రూత్‌’. సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌, జీ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌ వి మజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్స్‌, గణేశ్‌ ప్రమోషనల్‌ సాంగ్‌ మంచి రెస్పాన్స్‌ అందుకోగా.. తాజాగా మూవీ ట్రైలర్‌ని రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. 

సల్మాన్‌ కాప్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మహిమ మక్వానా, ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజా విడుదలైన ట్రైలర్‌లో బావ మరుదులు ఇరగదీశారు. ఓ సన్నీవేశంలో వారిద్దరూ షర్ట్‌లెస్‌గా చేసిన ఫైట్‌ సీన్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు ఇంకా రెట్టింపు అయ్యాయి. అయితే తాజాగా ఈ  సినిమాను నవంబర్‌ 26న విడుదల కానుంది. భారీ అంచనాలను ఈ మూవీ అందుకుంటుందో లేదో చూడాలి.

చదవండి: కష్టాల్లో సల్మాన్‌ తోడుగా ఉంటాడన్న షారుక్‌.. పాత వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు