రాజ్‌తరుణ్‌.. కూర్చుంది చాలులే : సమంత

సమంత చేతుల మీదుగా ‌‘స్టాండప్ రాహుల్’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల

గత కొంత కాలంగా టాలీవుడ్‌ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్‌ వరుస ఫ్లాప్‌లతో సతమతమౌతున్నాడు. “ఒరేయ్ బుజ్జిగా” ఓటిటిలో మంచి హిట్ కావడంతో ట్రాక్‌ లో పడ్డాడని అనుకుంటే మళ్లీ  “పవర్ ప్లే” సినిమాతో వెనకబడ్డాడు. దీంతో సిల్వర్ స్క్రీన్ పై మంచి కంబ్యాక్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం “స్టాండప్ రాహుల్” అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను  స్టార్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని ట్విటర్‌‌ ద్వారా విడుదల చేసింది. ‘మెక్‌ టెస్టింగ్‌ 1..2..3, చెక్‌ చెక్‌.. రాజ్‌తరుణ్‌ కూర్చుంది చాలు’అని పేర్కొంటూ సోషల్‌ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ చెప్పింది. 

కాగా, ఈ మూవీతో మోహన్ వీరంకి అనే వ్యక్తి  దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు . ఇందులో రాజ్‌ తరుణ్‌ సరసన యంగ్ హీరోయిన్, మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ ఫేం వర్ష బొల్లమ  నటిస్తుంది. రొమాంటిక్‌ డ్రామాగా సాగే ఈ చిత్రం జీవితంలో దేని గురించి ఆలోచించని ఓ వ్యక్తి  చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రాన్ని నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి నిర్మించారు. మరి ఈ చిత్రంతో అయినా రాజ్ తరుణ్ హిట్‌ కొట్టి తిరిగి ఫామ్‌లోకి వస్తాడో లేదో చూడాలి. 

Author: కె. రామచంద్రమూర్తి
మరిన్ని వార్తలు