Samantha: వైరల్‌గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్‌, మండిపడుతున్న నెటిజన్లు!

4 Sep, 2022 08:22 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత బీజేపీ, మోదీపై చేసిన ఓల్డ్‌ కామెంట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో సామ్‌ బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే తన మద్దతు అని కామెంట్స్‌ చేశారు. దీంతో గతంలో కూడా సమంత మోదీపై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను క్రికెటర్‌ అమిత్‌ కుమార్‌ షేర్‌ చేశాడు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ సామ్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. ఓ వీడియోలో సామ్‌ మాట్లాడుతూ.. ‘నేను ఎల్లప్పుడు మోదీజీ సపోర్టర్‌నే.  ఆయన చేసే మంచి కార్యక్రమాలతో సంతోషంగా ఉన్నా’ అని వ్యాఖ్యానించారు.

చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి

ఇక మరో వీడియోలో.. ‘నేను మోదీ సపోర్టర్‌. ఎందుకంటే ఆయన నాయకత్వంలో కచ్చితంగా మార్పు వస్తుందని నమ్ముతున్నా. ఆయన దేశాన్ని ముందుకు నడిపిస్తారు, ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువస్తారు’ అని చెప్పుకొచ్చింది. అయితే మోదీ ప్రస్తుతం నిర్ణయాల నేపథ్యంలో ఆమె పాత కామెంట్స్‌ను నెటిజన్లు వైరల్‌ చేస్తూ సామ్‌కు చురకలు అంటిస్తున్నారు. ‘ఎల్పీజీ సిలిండర్‌ 1100 రూపాయలు అయింది. ఆర్థిక వ్యవస్థలో మార్పు అంటే ఇదేనా?’ అంటూ  ఫైర్‌ అవుతున్నారు.

చదవండి: టైటిల్‌ నాదే.. హౌస్‌లో అడుగుపెట్టకుండానే రేవంత్ మ్యాటర్ లీక్, పోస్ట్‌ వైరల్‌

అంతేకాదు మోదీ తీసుకువస్తున్న పథకాలు, నిర్ణయాలపై అసహనంతో ఉన్న కొందరు నెటిజన్లు.. దానిని ఇప్పుడు సామ్‌పై వెల్లగక్కుతూ కామెంట్స్‌తో ట్రోల్‌ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సమంత చేతిలో శాకుంతలం, యశోద, ఖుషి, అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌ వంటి చిత్రాల్లో ఉండగా.. వీటిలో శాకుంతలం మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాంతర కార్యక్రమాలను జరపుకుంటుంది. వీటితో పాటు సామ్‌ ఓ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి రెడీ అవుతోందని సమాచారం.

మరిన్ని వార్తలు