'మయోసైటిస్‌' వ్యాధి వల్లే సమంత ముఖం అలా మారిపోయిందా?

30 Oct, 2022 12:54 IST|Sakshi

సమంత 'మయోసైటిస్‌' వ్యాధితో బాధపడుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. సామ్‌ పోస్ట్‌ చూసి సినీతారలు సహా ఆమె ఫ్యాన్స్‌ షాక్‌కి గురయ్యారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు అభిమానులు. 'గెట్‌ వెల్‌ సూన్‌ సామ్‌' అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా మయోసైటిస్‌ అనే వ్యాధి కారణంగానే సమంత ముఖం మారిపోయిందా అనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న సామ్‌ బయట కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో అప్పటికే రకరకాల రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. ఇటీవలె ఓ యాడ్‌లో కనిపించిన సమంత ముఖం ఉబ్బిపోయి తేడాగా కనిపించింది. దీంతో సర్జరీ చేయించుకుందనే వార్తలొచ్చాయి.

కానీ తాజాగా తాను మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడున్నట్లు స్వయంగా సమంత పేర్కొనడంతో ఆ వ్యాధి కారణంగానే సమంత ముఖం అలా మరిపోయిందని అంటున్నారు. ఏది ఏమైనా సామ్‌ త్వరగా కోలుకావాలంటూ ఆమె ఫ్యాన్స్‌ ప్రార్థిస్తున్నారు.

చదవండి: సమంత 'మయోసైటిస్‌' వ్యాధిపై అఖిల్‌ అక్కినేని కామెంట్స్‌ వైరల్‌

మరిన్ని వార్తలు