Samantha-Alia Bhatt: 'ఆర్​ఆర్​ఆర్'​ బ్యూటీ అలియాపై సమంత కామెంట్స్​..

27 Feb, 2022 15:00 IST|Sakshi

Samantha Lauds Alia Bhatt Performance In Gangubai Kathiawadi: గ్లామర్ రోల్స్​తోనే కాకుండా వైవిధ్యభరితమైన నాయికా ప్రాధాన్యత కథలు ఎంచుకుంటూ దూసుకెళ్తోంది బాలీవుడ్​ క్యూట్​గుమ్మ అలియా భట్​. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్​లో తెరకెక్కిన 'ఆర్​ఆర్​ఆర్'​లో అలియా సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో అలరించిన చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ప్రముఖ బీటౌన్​ డైరెక్టర్​ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాలో అజయ్​ దేవగణ్​, ఇమ్రాన్​ హష్మి, హ్యూమా ఖురేషి తదితరులు అతిథి పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీలో అలియా వేశ్యగా నటించడం, ట్రైలర్​ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాకు మంచి టాక్​ వచ్చింది. 

ఈ నెల 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతూ విజయవంతంగా ఆడుతోంది. ముఖ్యంగా ఇందులో అలియా నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్​ హీరోయిన్ సమంత అలియా నటనపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. '#గంగూబాయి కతియావాడి ఒక కళాఖండం.. అలియా మీ నటన గురించి వివరించడానికి పదాలు సరిపోవు. ప్రతీ ఒక్క డైలాగ్​, హావాభావాలు నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి.' అని తన ఇన్​స్టాగ్రామ్​ స్టోరీలో రాసుకొచ్చింది సామ్​. ఇంకా అనన్య పాండే, ఆదిత్య సీల్​, సోఫీ చౌదరి వంటి తారలు కూడా అలియా నటనపై ప్రశంసలు కురిపించారు.  

 

>
మరిన్ని వార్తలు