నెల రోజుల్లోపే ఓటీటీ వచ్చేస్తోన్న స్టార్ హీరో మూవీ!

6 Dec, 2023 16:12 IST|Sakshi

కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత జంటగా నటించిన చిత్రం సప్త సాగరాలు దాటి సైడ్-ఏ. ఈ ఏడాది సెప్టెంబర్‌ 22న ఈ చిత్రం రిలీజ్ కాగా సూపర్ హిట్‌ టాక్ అందుకుంది. దీంతో వెంటనే 'స‌ప్త సాగ‌రాలు దాటి సైడ్- బి' మూవీని తెరకెక్కించారు మేకర్స్. హేమంత్ ఎం.రావు ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 17న థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను మెప్పించలేకపోయింది. దీంతో అప్పుడే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన క్రేజీ న్యూస్ నెట్టింట తెగ వైరలవుతోంది. 

(ఇది చదవండి: 'యానిమల్' వైబ్‌లోనే ఆర్జీవీ.. డైరెక్టర్ గురించి అలాంటి ట్వీట్)

ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ తేదీపై క్రేజీ అప్‌డేట్‌ వినిపిస్తోంది. ఈ ల‌వ్ స్టోరీ డిసెంబ‌ర్ 15న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. క‌న్న‌డతో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన రాలేదు. ఈనెల 15న స్ట్రీమింగ్‌ అయితే నెల రోజుల్లోపే ఓటీటీలో చూస్తే ఛాన్స్ దక్కనుంది.

(ఇది చదవండి: రోడ్డుపై తాగి వీరంగం సృష్టించిన బాలీవుడ్‌ స్టార్‌? వీడియో వైరల్‌)

>
మరిన్ని వార్తలు