నన్ను చూసినావే పిల్ల!

19 Dec, 2023 00:31 IST|Sakshi
సంపూర్ణేష్‌ బాబు, ఆర్తి గుప్తా

సంపూర్ణేష్‌ బాబు, సంజోష్,ప్రాచీ బంసాల్, ఆర్తి గుప్తా ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘సోదరా’. మన్‌మోహన్‌ మేనంపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. క్యాన్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మాంక్‌ ఫిల్మ్స్‌పై చంద్ర చగంలా నిర్మిస్తున్నారు.

సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నన్ను చూసినావే పిల్ల.. నా కలలే నిజమయ్యేలా...’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు మేకర్స్‌. ‘‘సోదరా’ నుంచి ఇప్పటికే రిలీజైన ‘అన్నంటే దోస్తే సోదరా..’ అనే తొలి పాటకి మంచి స్పందన వచ్చింది. ‘నన్ను చూసినావే పిల్ల..’ పాట ఫ్రెష్‌ ఫీల్‌తో మంచి లవ్‌ రొమాంటిక్‌గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జాన్‌.

>
మరిన్ని వార్తలు