Sharwanand : కొత్త సినిమా కోసం కంప్లీట్‌ లుక్‌ మార్చేసిన శర్వానంద్‌

6 Mar, 2023 15:17 IST|Sakshi

ప్రామిసింగ్ హీరో శర్వానంద్ వైవిధ్యమైన సినిమాలతో ముందుకు వెళ్తున్నారు. చివరగా ఒకే ఒక జీవితం సినిమాలో నటించిన శర్వానంద్‌ తాజాగా తన 35వ సినిమాను అనౌన్స్‌ చేశాడు.టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం బాగా కష్టపడుతున్న శర్వానంద్‌ ఇందులో సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మలయాళ కంపోజర్ హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.


 

మరిన్ని వార్తలు