నాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు: హీరో సిద్ధార్థ్‌

29 Apr, 2021 14:19 IST|Sakshi

తమిళ బీజేపీ నాయకులు నా నంబర్‌ లీక్‌ చేశారు: సిద్ధార్థ

హీరో సిద్ధార్థ్‌ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్‌ తన పర్సనల్‌ మొబైల్ నంబర్‌ లీక్‌ చేసిందని ఆరోపించారు. అందువల్ల తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని.. తమపై అత్యాచారం చేస్తామని బెదిరింపు సందేశాలు వస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు సిద్ధార్థ్‌ ట్వీట్‌ చేశారు. ‘‘తమిళనాడు బీజేపీ ఐటీ సెల్‌ నా మొబైల్‌ నంబర్‌ లీక్‌ చేసింది. గడిచిన 24 గంటల్లో నాకు దాదాపు 500 అసభ్య సందేశాలు వచ్చాయి. నన్ను, నా కుటుంబ సభ్యులను చంపేస్తామని.. మాపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు. ఈ నంబర్లంన్నింటిని రికార్డ్‌ చేశాను. వీటిలో చాలా వరకు బీజేపీతో లింక్‌ ఉన్నవి.. ఆ పార్టీ గుర్తు డీపీగా పెట్టుకున్నవే ఉన్నాయి. వీట్నింటిని పోలీసులుకు అందించాను. నేను మౌనంగా ఉంటానని మాత్రం అనుకోవద్దు’’ అని తెలిపారు. 

దీంతో పాటు సిద్ధార్థ్‌ తనను బెదిరిస్తూ వచ్చిన మెసేజ్‌లను స్క్రీన్‌ షాట్‌ తీశారు. వాటిని తన ట్విట్టర్‌లో అప్‌లోడ్‌ చేశారు. ‘‘తమిళనాడు బీజేపీ నాయకులు నిన్న నా పర్సనల్‌ నంబర్‌ని లీక్‌ చేశారు. చాలా గ్రూపుల్లో నా నంబర్‌ చక్కర్లు కొట్టింది. వీరంతా నన్ను ట్రోల్‌ చేశారు. నేను కోవిడ్‌తో పోరాడాలా.. ఇలాంటి వారితో పోరాడాలా’’ అని వాపోయారు సిద్ధార్థ్‌. 

ఇక సిద్ధార్థ ట్వీట్‌పై నటి శ్రేయా ధన్వంతరీ స్పందించారు. ఇది చాలా దారుణం అంటూ ట్వీట్‌ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటంలో సిద్ధార్థ్‌ ముందు ఉంటారు. కొద్ది రోజుల క్రితం తన సోసల్‌ మీడియాలో కోవిడ్‌ను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని విమర్శిస్తూ సిద్ధార్థ్‌ ట్వీట్‌ చేశారు.

చదవండి: పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో సెటైర్‌

మరిన్ని వార్తలు