నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సోనాలి బింద్రే

7 Jun, 2021 17:07 IST|Sakshi

సోనాలి బింద్రే.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తొంభైలలో వెండితెరపై అగ్రనటిగా రాణిస్తూ.. తన గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకున్న ఆమె వివాహం అనంతరం సినిమాలకు దూరమయ్యారు. అలా తెరపై కనుమరుగైన సోనాలి బింద్రే ఎక్కడ ఉంది, ఏం చేస్తునేది కొంతకాలం వరకు స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఆమె క్యాన్సర్‌ బారిన పడ్డారని, అమెరికాలో చికిత్స పొందుతున్నట్లు ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.

అది విన్న అభిమానులు, సోనాలి బింద్రే త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇక చికిత్స అనంతరం ఆమె కొలుకుని పూర్తి ఆరోగ్యంతో భారత్‌కు తిరిగి వచ్చారు. సినిమాల్లో తన అందం, అభినయంతో అందరిని కట్టేపడేసిన ఆమెను గుండుతో చూసి అంతా షాక్‌ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా సోనాలి బింద్రే అమెరికా హాస్పిటల్‌లో క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న నాటి ఫొటోను షేర్‌ చేస్తూ గత చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గుండుతో బెడ్‌పై పేషేంట్‌గా ఉన్నా ఫొటోను ఆమె పంచుకున్నారు.   

‘కాలం ఎంత‌ తొందరగా పరుగులు తీస్తోంది. గత రోజులను వెన‌క్కి తిరిగి చూసుకుంటే ఆ స‌మ‌యంలో నేను ఎంత వీక్‌గా ఉన్నానో తలచుకుంటూనే ఆశ్చర్యంగా ఉంది. సి పదం(క్యాన్సర్) తర్వాత నా జీవితం ఎలా ఉందనే విషయాన్ని నిర్వచించలేనిది. అది నిజం‍గా నా జీవితంలో భయానక చేదు జ్ఞాపకం. అందుకే ఎవరి జీవితాన్ని వారే ఎంపిక చేసుకోవాలి. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే మీ లైఫ్‌ జర్నీ అలా కొనసాగుతుంది’ అంటు ఆమె రాసుకొచ్చారు. కాగా సోనాలి బింద్రే తెలుగులో మహేశ్‌ బాబు, చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున వంటి స్టార్‌ హీరోలందరితో క‌లిసి ఆమె ప‌ని చేశారు. 

A post shared by Sonali Bendre (@iamsonalibendre)

చదవండి: 
సినీ కార్మికులందరికి ఉచితంగా వ్యాక్సిన్‌ : చిరంజీవి 
కరోనాతో నెల రోజులు ఆస్పత్రిలోనే, హోప్స్‌ మొత్తం పోయాయి: నటి

మరిన్ని వార్తలు