కమిట్‌ అయ్యారా..? అంటూ శ్రీలీలను అడిగిన నెటిజన్‌.. సమాధానం ఇదే

12 Nov, 2023 12:41 IST|Sakshi

టాలీవుడ్​ మోస్ట్ వాంటెడ్​ హీరోయిన్ లిస్ట్‌లో శ్రీలీల టాప్‌లో ఉంటుంది. ఏడాది నుంచి చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. చిన్న సినిమా అయిన పెళ్లి సందడితో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది ఇప్పుడు అగ్ర తారలతో స్క్రీన్ షేర్​ చేసుకునే స్థాయికి వెళ్లిపోయింది. కొద్దిరోజుల క్రితమే భగవంత్ కేసరిలో అందరికీ గుర్తుండిపోయే పాత్రలో శ్రీలీల మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ భారీ చిత్రాల షూటింగ్‌ షెడ్యూల్‌లలో బిజీగా ఉంది. అయితే ఇంతటి బిజీ షెడ్యూల్​లోనూ ఈ చిన్నది తన ఫ్యాన్స్​ను పలకరించడం అస్సలు మరచిపోదు.

వాళ్ల కోసం తన సోషల్ మీడియా వేదికల్లో సినిమా అప్డేట్స్​తో పాటు లేటెస్ట్ ఫొటోలను షేర్​ చెస్తుంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అభిమానులతో ముచ్చటించింది.తన అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో అక్కడ వివిధ ఆసక్తికరమైన ప్రశ్నలకు శ్రీలీల సమాధానం ఇచ్చింది. అందులో ఒక నెటిజన్, ? ' మీరు ఈ రోజు బిగ్ బాస్‌కి వస్తున్నారా?' అని అడిగారు. దానికి శ్రీలీల స్పందిస్తూ, 'అవును, ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ కోసమే' అని చెప్పింది.

మరో వ్యక్తి (ఆర్‌ యూ కమిటెడ్‌..?) అని శ్రీలీలను ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగాడు.. ఆమె సమాధానం సూటిగా అవును అని చెబుతూ.. ' నేను నా పని విషయంలో కమిటెడ్‌గానే ఉంటాను.' అని కౌంటర్‌లా సమాధానం ఇచ్చింది. అభిమానులు అడిగిన ప్రశ్నలతో పాటు ఆమె చెప్పిన సమాధానాలు కూడా శ్రీలీల షేర్‌ చేసింది. అవి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వైష్ణవ్‌ తేజ్‌-శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ చిత్రం నవంబర్‌ 24న విడుదల కానుంది.

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని వార్తలు