‘శ్రీవల్లీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ .. ప్రేమ కోసం పుష్పరాజ్‌ తిప్పలు చూశారా?

4 Jan, 2022 20:59 IST|Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, హీరోయిన్‌ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం పుష్ప మూవీలోని ‘శ్రీవల్లి’సాంగ్‌ ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. 2021లో అత్యధిక మంది శ్రోతల్ని అరించిన పాటల్లో ఇది ఒకటి. సినిమా ప్రమోషన్‌కి పాట చాలా ఉపయోగపడింది.  రష్మిక ఎక్స్‌ప్రెషన్స్‌ , బన్నీ ‘చెప్పు స్టెప్పు’సోషల్‌ మీడియా బాగా వైరల్‌ కావడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఈ పాట ఫుల్‌ వీడియో ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్న వారికి చిత్రబృందం సర్‌ప్రైజ్‌ అందించింది. సోషల్‌ మీడియా వేదికగా  ‘శ్రీవల్లీ’ఫుల్‌ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటకు చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా.. సిధ్‌ శ్రీరామ్‌ అద్భుతంగా ఆలపించాడు. కాగా, డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ రికార్డు కలెక్షన్స్ సాధిస్తుంది. ముఖ్యంగా నార్త్ లో ఈ మూవీ ఎవరూ ఊహించని వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.

మరిన్ని వార్తలు