అంతా కొత్తవారితో...

25 Sep, 2020 01:43 IST|Sakshi

శ్రీకాంత్, రీతూరెడ్డి జంటగా గురువారం హైదరాబాద్‌లో పూజాకార్యక్రమాలతో ఓ సినిమా ప్రారంభం అయ్యింది. వరుణ్‌. కె దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వి ప్రొడక్షన్స్‌ çసంస్థ నిర్మిస్తోంది. గతంలో ‘జ్యోతిలక్ష్మీ’, ‘సఖియా’,‘చిన్నదాన’ తదితర షార్ట్‌ఫిల్మ్స్‌కి దర్శకత్వం వహించారు వరుణ్‌. దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని పల్లెటూర్లలో ఉండే పగప్రతీకారాలతో 1998 ప్రాంతంలో జరిగే కథతో తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరున రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని చిత్రబృందం తెలిపింది. అంతా కొత్త నటీనటులతో ఈ చిత్రం తెరకెక్కనుంది ఈ చిత్రానికి సంగీతం: రోహిత్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు