సుధీర్‌బాబు కొత్త సినిమా..ఆగస్టులో ప్రారంభం

13 Jul, 2021 00:22 IST|Sakshi
సుధీర్‌బాబు

‘శ్రీదేవి సోడా సెంటర్‌’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాలతో బిజీగా ఉన్న హీరో సుధీర్‌బాబు తాజాగా మరో కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నటుడు, రచయిత హర్షవర్థన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో నారాయణదాస్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్‌ ఆగస్టులో ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు