నెక్స్ట్‌ సినిమాను లైన్‌లో పెట్టిన సుధీర్‌బాబు

12 Jul, 2021 13:46 IST|Sakshi

హీరో సుధీర్‌ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా మరో మూవీని అనౌన్స్‌ చేశాడు. హర్షవర్ధన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇప్పటికే నటుడిగా, రచయితగా హర్షవర్థన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.  రొమాంటికి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంస్థ నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. హీరోయిన్‌ సహా మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. 

ఇప్పటికే ఈ బ్యానర్‌లో లవ్‌స్టోరీ సినిమాతో పాటు ధనుష్‌- శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో ఓ చిత్రం రూపొందుతున్నాయి. ప్రస్తుతం సుధీర్‌బాబు  ఇంద్రగంటి మోహనకృష్ణ  దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో పాటు కరుణ కుమార్‌ డైరెక్షన్‌లో శ్రీదేవి సోడా సెంటర్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ సినిమాకు సైతం సైన్‌ చేశారు. 

 

మరిన్ని వార్తలు