డైరెక్టర్‌ సుకుమార్‌ కీలక నిర్ణయం.. భార్యకు కొత్త బాధ్యతలు

2 Jun, 2021 14:06 IST|Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ  'సుకుమార్ రైటింగ్స్'లో సినిమాలు తెరకెక్కిస్తున​ విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆయన మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించిన ఉప్పెన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ నిర్మాణ సంస్థకు సంబంధించి సుకుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్‌ రైటింగ్స్‌ బాధ్యతలు తన భార్య తబితకు అప్పగించినట్లుగా సమాచారం. ఇది వరకు సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌కు సంబంధించిన విషయాలన్నీ ఆయన స్నేహితుడు, మేనెజర్‌ ప్రసాద్‌ చూసుకునేవారు.

అయితే కొద్ది రోజలు క్రితం ఆయన గుండెపోటుతో మరణించారు. దీంతో ఆ బాధ్యతల్ని ఇప్పుడు భార్య తబితకు సుకుమార్‌ అప్పగించినట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఆయన సూచనలతో తబిత కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ అల్లు అర్జున్‌తో పుష్ప అనే పాన్‌ ఇండియా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. బన్నీ-సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్ర‌స్తుతం సుకుమార్ రైటింగ్స్ నిఖిల్‌తో 18 పేజెస్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

చదవండి : హీరో తరుణ్‌తో ‘పుష్ప’ మూవీ టీం చర్చలు!
బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రెండు భాగాలుగా ‘పుష్ప’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు