Mansoor Clarification: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్‌గా వివరణ ఇచ్చిన మన్సూర్!

20 Nov, 2023 07:24 IST|Sakshi

దక్షిణాది నటుడు మన్సూర్ అలీ ఖాన్ తాజాగా 'లియో' చిత్రంలో కనిపించాడు. అందులో ఆయనతో పాటు నటించిన హీరోయిన్‌ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం చేశాడు. ఈ విషయంపై ఇప్పటికే త్రిషతో పాటు తమిళనాడులోని చాలామంది ప్రముఖులు రియాక్ట్‌ అయ్యారు. మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. 

మన్సూర్ అలీ ఖాన్ క్లారిఫికేషన్: 
నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఈ వివాదం గురించి తన సోషల్ మీడియాలో ఇలా తెలిపాడు. తన మాటలను తప్పుగా చూపించినందుకు నటుడు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నటి త్రిష కృష్ణన్‌ను మెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని మీడియా సమావేశంలో అన్నారు.. లియోలో నటి త్రిష కృష్ణన్ పాత్రను 'పర్వతాన్ని ఎత్తుకున్న హనుమాన్'తో పోల్చారు. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం. ఆమెకు కాంప్లిమెంట్స్ ఇచ్చాను. 'దురదృష్టవశాత్తూ, ఆ స్టేట్‌మెంట్ తీసివేయబడింది. కొన్ని స్టేట్‌మెంట్‌లు మాత్రమే ఆక్కడ ఎడిట్ చేసి ఎవరో కావాలనే వైరల్ చేశారు.

త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందన్నారు. ఆమెను గౌరవిస్తున్నానని చెప్పారు. సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదు. తాను ఎవరినో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసు. అంటూ మన్సూర్ అలీ ఖాన్ తమిళంలో ఇలా రాశారు. 'నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పుగా చూపించి నాపై రాజకీయాలు చేస్తున్నారు. నా సినిమాల గమనాన్ని ప్రభావితం చేసేందుకే ఇలా చేస్తున్నారు. స్త్రీల పట్ల నాకెంతో గౌరవం ఉంది. నేను గతంలో చాలా మంది నటీమణులతో పనిచేశాను. నేనెప్పుడూ ఎవరితోనూ అసభ్యకరంగా ప్రవర్తించలేదు.' అని తెలిపాడు.

ఏం జరిగిందంటే..?
కోలీవుడ్‌ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో  ‘లియో’ సినిమాలో త్రిషతో ఓ సీన్‌ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.  నేను గతంలో ఎన్నో చిత్రాల్లో రేప్‌ సీన్లలో నటించాను. ‘లియో’లో కూడా  త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందని అనుకున్నా. కానీ అలాంటి సీన్‌ లేకపోవడంతో చాలా బాధగా అనిపించింది.' అని మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలు చేశాడు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సినీ పరిశ్రమ నుంచి  తీవ్ర అసంతృప్తి వచ్చింది.  నటి ఖుష్బూ సుందర్, దర్శకుడు లోకేష్ కనకరాజ్, గాయని చిన్మయి శ్రీపాద తదితరులు ఆయన ప్రకటనను తీవ్రంగా ఖండించారు.

A post shared by Mansoor Ali Khan (@mansoor_alikhan_offl)

మరిన్ని వార్తలు