నేను ఎంతో ప్రేమించే వ్యక్తి పుట్టినరోజు నేడు: మహేష్‌

22 Jan, 2021 10:56 IST|Sakshi

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతోనే గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇక ఫ్యామిలీ అకేషన్స్‌ అయితే మరింత గ్రాండ్‌గా నిర్వహిస్తుంటారు. నేడు మహేష్‌ భార్య నమ్రత పుట్టినరోజు సందర్భంగా దుబాయ్‌లో గ్రాండ్‌గా వేడుకలు ప్లాన్‌ చేసినట్లు సమాచారం. జనవరి 22వ తేదీ 1972 సంవత్సరంలో జన్మించిన నమ్రత.. నేడు 49వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. శ్రీమ‌తి పుట్టిరోజు సందర్భంగా సూపర్‌స్టార్‌ స్పెషల్‌ విషెస్‌ అందజేశారు. (మహేశ్‌ ఫిట్‌నెస్‌‌ సీక్రెట్‌ ఇదేనా.. వీడియో వైరల్‌)

 'ఈరోజు నేను ఎంతో ప్రేమించే వ్యక్తి పుట్టినరోజు. ప్రతీరోజు నీతో గడపడం నాకు ప్రత్యేకం అయినప్పటికీ ఈరోజు మరింత ప్రత్యేకం. అద్భుతమైన స్త్రీతో అంద‌మైన రోజు..లేడీ బాస్‌కు ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ మహేష్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. భార్యపై మహేష్‌ కురిపించిన ప్రేమకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. ఇక ప్రస్తుతం స‌ర్కారు వారి పాట అనే చిత్రంలో మహేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప‌ర‌శురాం ద‌ర్శ‌కత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా తొలిసారి కీర్తిసురేష్‌ నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించి తొలి షెడ్యూల్‌ను దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు. (నమ్రత పోస్టుపై హర్ట్‌ అయిన నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజు)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు