Mahesh Babu Teachers Day Wishes: 'ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను'

5 Sep, 2021 13:09 IST|Sakshi

Mahesh Babu Childhood Image With Krishna: సెప్టెంబర్‌5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు తమ జీవితంలో కీలక పాత్ర పోషించిన గురువులను గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తన మొదటి గురువు, తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణతో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోను షేర్‌ చేస్తూ.. 'ప్రేమ, ఆప్యాయతలు దయాగుణం, క్రమశిక్షణ, వినయం, పరిస్థితుల్లో బలంగా ఉండటం వంటి ఎన్నో మంచి విషయాలు నేర్పించిన నాన్నకి ధన్యవాదాలు. ఆయనతో పాటు ఈ ప్రయాణంలో నా అభివృద్ధికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. హ్యాపీ టీచర్స్‌ డే' అంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశారు. 

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్‌ పరుశురామ్‌ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తొలిసారి కీర్తి సురేశ్‌ మహేశ్‌తో జత కట్టనుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్‌ ప్లస్‌ పతాకాల రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. 

చదవండి : 'గీతాంజలి' హీరోయిన్‌ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సింగర్‌ సునీత ఎమోషనల్‌ పోస్ట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు