బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్న  ‘ఆకాశం నీ హద్దురా!’

13 Jul, 2021 00:04 IST|Sakshi

తమిళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘సూరరై పోట్రు’ హిందీలో రీమేక్‌ కానుంది. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. సూర్య నిర్మాత కూడా. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’గా వచ్చిన సంగతి తెలిసిందే.

గత ఏడాది నవంబరులో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలై వీక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అంతేకాదు.. 93వ ఆస్కార్‌ అవార్డుల నామినేషన్‌ ఎంపిక బరిలో నిలిచింది. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయనున్నట్లు సూర్య వెల్లడించారు. బాలీవుడ్‌ నిర్మాత విక్రమ్‌ మల్హోత్రాతో కలిసి ఈ  చిత్రాన్ని హిందీలో నిర్మించనున్నారు సూర్య. మాతృతకు దర్శకత్వం వహించిన సుధా కొంగరయే హిందీ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించనున్నారు.  హిందీలో నిర్మాతగా సూర్యకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. అయితే ఈ రీమేక్‌లో ఎవరు హీరోగా నటిస్తారనేది తెలియాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు