షార్ట్‌ ఫిలిం.. లాంగ్‌ హెయిర్‌ 

18 Nov, 2020 00:51 IST|Sakshi

ఇప్పటివరకూ పెద్ద పెద్ద (నిడివి ఎక్కువ) సినిమాలు చేసిన హీరో సూర్య ఇప్పుడు ఓ చిన్న (షార్ట్‌) ఫిలిం చేస్తున్నారు. నవరసాల నేపథ్యంలో తొమ్మిది కథలతో దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్న వెబ్‌ మూవీలో ఓ కథలో సూర్య హీరోగా కనిపిస్తారు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్‌ ఫిలిం చిత్రీకరణ మంగళవారం ఆరంభమైంది. పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడిగా చేస్తున్నారు. ఈ షార్ట్‌ ఫిలింలో సూర్య లాంగ్‌ హెయిర్‌తో కనిపిస్తారు. నిజానికి ‘ఆకాశమే నీ హద్దురా’ తర్వాత ఆయన పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు. ఈ సినిమా కోసమే జుట్టు పెంచారు. అదే లుక్‌ లో ‘నవరస’లో కనబడనున్నారు. ‘వెబ్‌ ఫిలిం స్టార్ట్‌ చేశాం. ఈరోజు సెట్స్‌ లో ఎనర్జీ రెండింతలు. దానికి కారణం సూర్య’  అని పేర్కొన్నారు పీసీ శ్రీరామ్‌. మిగతా ఎనిమిది కథలను ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తారు. వాటిలోనూ పేరున్న నటీనటులు కనబడతారు.   

మరిన్ని వార్తలు