ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా ‘గణా’ ఫస్ట్‌లుక్‌

26 Sep, 2022 15:02 IST|Sakshi

దుర్మార్గుడు ఫేం విజయ్‌ కృష్ణ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం గణా. సుకన్య తేజు హీరోయిన్స్‌ నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ తాజాగా రిలీజ్‌ అయ్యింది. ప్రముఖ డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణారెడ​ఇ మాట్లాడుతూ.. ‘నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా.

ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన మరో వ్యక్తి పేరు కూడా క్రిష్ణారెడ్డే. కాకపోతే విజయ్ క్రిష్ణా రెడ్డి. విజయ క్రిష్ణా రెడ్డి కృషితో, పట్టుదలతో, దీక్ష‌తో  గ‌ణా చిత్రాన్ని రూపొందించారు. ఆయన హీరోగా న‌టిస్తూ  కథ, స్క్రీన్ ప్లే, ప్లస్ డైరెక్షన్ కూడా చేశారు. అంతేకాదు ఆయన ప్రొడ్యూసర్‌గా కూడా. అన్నీ ఆయనే చేస్తూ సినిమా తీయ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు’ అని అన్నారు. కాగా రాధా మమతా ప్రెజెంట్స్, ఎస్.కె. ఆర్ట్స్ బ్యానర్స్‌పై విజయ్‌ కృష్ణ నిర్మించారు.

మరిన్ని వార్తలు