ఇప్పటివరకు రూ.24 లక్షలు పైనే ఖర్చు చేశాం: సోహైల్‌

14 Jun, 2021 19:24 IST|Sakshi

సినీకార్మికులకి నిత్యావసర వస్తువులను అందించిన సోహైల్..!!

బుల్లితెర హిట్‌ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌తో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు సోహైల్‌. యాంగ్రీ మ్యాన్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లో అయన చూపించిన ఆటతీరుకు లక్షలాది మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఫ్రెండ్‌షిప్‌ అంటే ప్రాణాలిచ్చే అతడు తన స్నేహాన్ని, ఆటను బ్యాలెన్స్‌ చేస్తూ ఫినాలే వరకు వచ్చాడు. సెకండ్‌ రన్నరప్‌గా నిలిచిన సోహైల్‌ను మెగా స్టార్ చిరంజీవి కూడా మెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ రియాలిటీ షో తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ టాక్ అఫ్ ది టౌన్ గా మారాడు సోహైల్‌.

సోహైల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఆయన ఇప్పటివరకు చాలామందికి సహాయం చేశాడు. తాజాగా అతడు లాక్ డౌన్‌లో ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు తనవంతు సాయంగా నిత్యావసర వస్తువులను సరఫరా చేశాడు. అంతేకాకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చాడు. ఇది తానొక్కడి శ్రమ మాత్రమే కాదని, కొంతమంది ఫ్యాన్స్ కలిసి సోహిలియన్స్ గా ఫామ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపాడు.  

ఈ సంస్థ ద్వారా ఇప్పటికే 24 లక్షలకు పైగా ఖర్చుతో వైద్య సేవలు అందించామని వెల్లడించాడు. గుండె సంబంధిత వ్యాధులతో, బ్రెయిన్ ట్యూమర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆదుకున్నామని అయన తెలిపాడు. భవిష్యత్తులో కూడా ఇలానే చేస్తామని, అందుకు మీ ఆశీర్వాదాలు కావాలన్నాడు.  ఈ సంస్థ ఇంత బాగా పనిచేయడానికి, ముందుకు వెళ్ళడానికి సోహిలియన్స్ ఎంతో కష్టపడుతున్నారని పేర్కొన్నాడు.

చదవండి: సుశాంత్‌ మరణానికి ఏడాది.. మరి న్యాయం??

'సంతోషం'లో నటించిన ఈ బుడ్డోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు