మాథ్యూస్‌ మంచి సన్నిహితుడు..పెళ్లిపై తాప్సీ క్లారిటీ!

11 Jun, 2021 19:31 IST|Sakshi

కరోనా కాలంలో నటీనటులు, హీరోహీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్‌ హీరోయిన్‌ తాప్సీ పన్ను పెళ్లి వార్త మరోసారి తెరపైకి వచ్చింది. కాగా కొంతకాలంగా ఆమె డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్‌ మ్యాథ్యూస్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మ్యాథ్యూస్‌తో తను ప్రేమలో ఉన్నట్లు గతేడాది తాప్సీ అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉండగా త్వరలోనే తాప్సీ-మాథ్యూస్‌లు ఏడడుగులు వేయ్యనున్నారనే వార్త కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీంతో తాప్సీ ఈ రూమర్స్‌పై తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ‘నాకు ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. మాథ్యూస్‌ నాకు బాగా తెలిసిన వ్యక్తి, సన్నిహితుడు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతంలో తన రిలేషన్‌పై మాట్లాడుతూ.. సినిమా రంగానికి కానీ, సినీ బ్యాగ్రౌండ్‌ ఉన్న వ్యక్తిని అసలు పెళ్లి చేసుకోనని తాప్పీ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిన సంగతి తెలిసిందే.

తాను సినీ నటి అయినందున బయటి వ్యక్తినే వివాహం చేసుకోవానుకుంటానని, నటన తప్ప అది ఏ రంగమైనా పర్లేదు అని చెప్పుకొచ్చింది. అంతేగాక తన వృతి, వ్యక్తిగత జీవితం వేరువేరుగా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెబుతూ గతంలో ​మ్యాథ్యూస్‌తో ప్రేమలో ఉన్న విషయం వెల్లడించింది. కాగా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నానని, ఏడాదికి కనీసం 6 సినిమాలు చేస్తున్నట్లు పేర్కొంది. ఆ సంఖ్య 2 లేదా 3కు పడిపోయినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటానని తాప్సీ స్పష్టం చేసింది. 

చదవండి: 
దాదీ మళ్లీ తిరిగొస్తారనుకున్నా: తాప్సీ ఎమోషనల్‌

మరిన్ని వార్తలు