తలసాని శ్రీనివాస్‌ చేతుల మీదుగా ‘యూత్‌ అబ్బా మేము’ పాట

18 Sep, 2021 14:24 IST|Sakshi

చిన్ను క్రిష్, గీతిక రతన్ జంటగా, ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై సముద్రాల మంత్రయ్య బాబు నిర్మించిన చిత్రం ‘లవ్ యు రా’. ఈ చిత్రంలోని ‘యూత్ అబ్బా మేము’ అనే పాటను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఇప్పుడు ఈ పాటయూట్యూబ్‌లో మంచి స్పందన అందుకుంటుంది. కంచరపాలెం  మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్థి పాడిన ఈ సాంగ్‌ను పాటలు రత్నం బట్లురి రాయగా.. ఈశ్వర్ పెరవలి సంగీతం సమకూర్చారు.  

ఈ సందర్భంగా నిర్మాత సముద్రాల మంత్రయ్య బాబు మాట్లాడుతూ.. ‘మా విన్నపాన్ని గౌరవించి ఈ సినిమాలోని పాటను విడుదల చేయడానికి ఒప్పుకున్న మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అయన ఋణం తీర్చుకోలేనిది.  అద్భుతమైన కథతో  సినిమాను తెరకెక్కించారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేసుకుంటుంది.. త్వరలోనే విడుదల తేదీతో ప్రేక్షకుల ముందుకు వస్తాం’ అన్నారు. 

దర్శకుడు ప్రసాద్ ఏలూరి మాట్లాడుతూ.. ఈ సినిమా లో ‘యూత్ అబ్బా మేము’ అనే పాటను విడుదల చేసిన మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ కథను వినగానే ఒకే చేసిన నిర్మాతగారికి కృతజ్ఞతలు.. అయన ఇచ్చిన ఈ అవకాశం వినియోగించుకుంటాను. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. కాగా ఈ సినిమాలో శేఖర్ బండి , సాయినాగ్, మధుప్రియ, దివ్య, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు, నాగిరెడ్డి, చిట్టి బాబు , తదితరులు నటిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు