'త్వరగా పూర్తి చేయండి ప్లీజ్‌'.. తమన్నా రిక్వెస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌

8 Sep, 2022 08:08 IST|Sakshi

కొన్ని పాటలు కొందరికే యాప్ట్‌గా ఉంటాయి. అలా గ్లామర్‌ పాత్రలకైనా పాటలకైనా పర్ఫెక్ట్‌ నటి అంటే తమన్నానే అనడంలో అతిశయోక్తి ఉండదేమో. ‘అందం తిన్నానండి.. అందుకే ఇలా ఉన్నానండి’ అంటూ పాడుతూ యువతను ఉర్రూతలూగిస్తున్న ఈ మిల్కీ బ్యూటీకి ఇటీవల చిన్న గ్యాప్‌ వచ్చిందనే చెప్పాలి. దీంతో ఆమె టైం అయిపోయిందని ప్రచారం జోరుగా సాగింది. అయితే అలాంటి పసలేని ప్రచారాలను తొక్కేస్తూ తాజాగా మళ్లీ కథానాయికగా పుంజుకుంటున్నారు.

హిందీలో మూడు చిత్రాలు, తెలుగులో మూడు చిత్రాలు, మలయళంలో ఒక చిత్రం ఇలా అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటిలో తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవికి జంటగా నటిస్తున్న భోళా శంకర్, తమిళంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో నటిస్తున్న భారీ చిత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా మరిన్ని అవకాశాలు ఈ అమ్మడి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. దీంతో తమన్నా జైలర్‌ చిత్ర దర్శకుడు నిల్సన్‌కు ఒక విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్‌ అవుతోంది.

అదేంటంటే తన పోర్షన్‌ షూటింగ్‌ త్వరగా పూర్తి చేయాలని కోరిందట. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలతో పాటు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు ఆమె నిల్సన్‌కు వివరించినట్లు సమాచారం. కాగా ఈ బ్యూటీ హిందీలో నటించిన బబ్లీ బౌన్సర్‌ చిత్రంలో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించిన ఈ చిత్రంపై తమన్నా చాలా ఆశలు పెట్టుకున్నట్లు టాక్‌. ఇది థియేటర్లో విడుదల కాకపోవడంతో నిరాశకు గురైందట. మరి నెట్టింట్లో ఈ చిత్రాన్ని వీక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

చదవండి: (ఆహాలో హన్సిక మహ మూవీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?)

  

మరిన్ని వార్తలు