ఆరత్రికా రెడ్డి బ్యాంకుకి రూ. 10 వేల కోట్లు చెల్లించాలి!

9 Apr, 2021 08:24 IST|Sakshi

‘తెలుగు వెబ్‌ సిరీస్‌లలో ‘లెవన్త్‌ అవర్‌’కు ఓ స్టాండర్డ్‌ ఉంది. అందుకే బిగ్గెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ అని కూడా అంటున్నారు. కాస్టింగ్, విజువల్స్‌ పరంగా వెబ్‌ సిరీస్‌ రిచ్‌గా ఉంటుంది’’ అని డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు అన్నారు. తమన్నా లీడ్‌ రోల్‌లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘లెవన్త్‌ అవర్‌’. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ ‘ఆహా’ ఓటీటీలో నేటి నుంచి ప్రసారం కానుంది.

ఈ సందర్భంగా ప్రవీణ్‌ సత్తారు గురువారం నాడు విలేఖరులతో మాట్లాడుతూ.. ‘దర్శకుడిగా ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాను. నా తొలి వెబ్‌ సిరీస్‌ ఇది. ఓ హోటల్‌లో రాత్రి పదకొండు గంటల నుంచి పొద్దున ఎనిమిది గంటల వరకు జరిగే కథ ఇది. ఈ తక్కవ సమయంలోనే ఆరత్రికా రెడ్డి (తమన్నా) బ్యాంకుకి పదివేల కోట్ల రూపాయలు చెల్లించాలి. ఇంతకీ ఆమె డబ్బులు చెల్లించిందా, లేదా అనేదే కథ. తొలి నాలుగు ఎపిసోడ్స్‌ ఓ పేస్‌లో ఉంటే.. చివరి నాలుగు ఎపిసోడ్స్‌ మరో పేస్‌లో ఉంటాయి. 42 రోజులు షూటింగ్‌ అనుకున్నా టీమ్‌ సహకారంతో 33 రోజుల్లోనే పూర్తి చేశాం. సెన్సార్‌ పరిధి దాటి ఏ సన్నివేశాన్నీ తీయలేదు’’ అన్నారు.

చదవండి: 
హీరోయిన్‌ అంజలికి కరోనా..ఆమె ఏమందంటే..‌
ఫొటోలు: మాల్దీవుల్లో జాన్వీ సందడి

మరిన్ని వార్తలు