Krithi Shetty Birthday Special : ‘బేబమ్మ’కు హ్యాపీ బర్త్‌డే

21 Sep, 2021 14:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  టాలీవుడ్‌కు దొరికిన మరో అందమైన హీరోయిన్‌ కృతి శెట్టి. ఈ పేరు వింటేనే కుర్రకారు గుండెల్లో గుబులు. బేబమ్మ అంటూ  తొలిసినిమాతోనే  ఈ అమ్మడు సాధించిన క్రేజ్‌ అలాంటిది మరి. క్యూట్‌ స‍్మయిల్‌తో.. చక్కని అందం... అభినయంతో కూడా జనాల్ని కట్టిపడేసింది. తెలుగులో స్పష్టంగా, చాలా చక్కగా మాట్లాడేస్తూ.. టాలీవుడ్‌లో ఇంత తక్కువ కాలంలో ఇంత ఫాలోయింగ్‌ సాధించిన ఘనతను కొట్టేసింది. అంతేకాదు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. కృతి శెట్టి పుట్టినరోజు సందర్బంగా ఆమెకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. 

అంతేకాదు కృతిశెట్టి కూడా డాక్టరు అవ్వాలనుకుందట. తద్వారా జనాలకు సేవ చేయలనుకుందిట. కానీ అనుకోకుండా సినిమా చాన్స్‌రావడంతో హీరోయిన్‌గా సెటిల్‌ అయిపోయింది. అలాగే డాన్స్‌ అన్నా, బేకింగ్‌ అన్నా చాలా ఇష్టమట. లాక్‌డౌన్‌ కాలంలో చాలా కేక్స్‌ కూడా తయారు చేసిందిట ఈ భామ.

2003, సెప్టెంబరు 21న కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించింది కృతి శెట్టి.  చిన్నప్పటినుంచే పలు యాడ్స్‌తో తన ప్రత్యేకతను చాటుకుంది.  ఐడియా, షాప్పర్స్ స్టాప్, పార్లే, లైఫ్ బాయ్, బ్లూ స్టార్ వంటి సంస్థల యాడ్స్ లో  అలరించింది.  మోడ‌లింగ్‌ అలా మొదలు పెట్టిందో లేదో  హిందీలో 2019లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'సూపర్ 30' సినిమాలో విద్యార్థిగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.  ఆ తరువాత తొలిసారిగా 2021 తెలుగు సినిమా "ఉప్పెన" ద్వారా  టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.  మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌తో చాన్స్‌కొట్టేసి, యూత్‌ క్రష్‌గా మారిపోయింది.  ఒకదశలో సూపర్ జోడి నిజ జీవితంలో కూడా జతకడితే బావుండు అన్నంతగా మారిపోయారు క్రేజీ కపుల్‌. అంతేకాదు ఉప్పెన మూవీ పాటలు కూడా అంతే పాపులర్‌ అయ్యాయి. అలాగే ఈ మూవీలోని ‘ఈశ్వరా.. పరమేశ్వరా’ పాటకు  శివరాత్రి సందర్భంగా  స్పెషల్‌ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చి  ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది

ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న "శ్యామ్‌ సింగరాయ్‌"‌ చిత్రంలో  క‌థానాయిక‌గా నటిస్తుంది. సెప్టెంబరు 21 ఆమె పుట్టిన రోజు సందర్బంగా 'శ్యామ్ సింగ రాయ్' సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్‌. అలాగే అండ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న  మరో మూవీలో హీరో రామ్‌తో జతకడుతోంది కృతి శెట్టి. లింగుసామి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ యూనిట్‌ కూడా కృతి శెట్టి బర్త్ డే పోస్టర్‌ విడుదల చేసింది. దీంతోపాటు సుధీర్ బాబు సరసన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చేస్తోంది. యూత్ స్టార్ నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే మూవీలో నటించనుంది. ముఖ్యంగా టాలీవుడ్‌ మన్మధుడు అక్కినేని  నాగార్జున  ‘బంగార్రాజు’ మూవీలో చాన్స్‌ కొట్టేసింది కృతి శెట్టి.  ఈ మూవీలో నాగచైతన్యతో  రొమాన్స్ చేసేందుకు రడీ అవుతోంది. మరి తన సెలబ్రిటీ క్రష్‌ రామ్‌ చరణ్‌ అని ప్రకటించిన ఈ అమ‍్మడు త్వరలోనే రామ్‌చరణ్‌ సరసన కూడా నటించాలని కోరుకుందాం.

మరిన్ని వార్తలు