Dil Raju: వాటితో ఇండస్ట్రీకి చెడ్డ పేరు: సంక్రాంతి రేసుపై దిల్‌ రాజు

4 Jan, 2024 21:10 IST|Sakshi

సంక్రాంతికి టాలీవుడ్‌ సినిమాలు పెద్దఎత్తున పోటీకి సిద్ధమయ్యాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ నిర్మాతలు సమావేశమై సినిమాల రిలీజ్‌పై తలెత్తిన సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన నిర్మాత దిల్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా లో వస్తున్న ఆర్టికల్స్‌తో ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ఎవరైనా సరే నిజాలు తెలుసుకొని రాయండని దిల్‌ రాజు కోరారు. ముఖ్యంగా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నందుకు రవితేజకు కృతజ్ఞతలు తెలిపారు. 

దిల్‌ రాజు మాట్లాడుతూ..'సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది. దయచేసి నిజాలు తెలుసుకొని రాయండి. సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలతో చర్చించాం. ఒక సినిమా వెనక్కి తగ్గితే ఏదో జరిగినట్టు కాదు. గతేడాది మూడు సినిమాలకే రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు 5 సినిమాలు పోటీలో ఉన్నాయి. మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా రవితేజ, పీపుల్స్ మీడియా వారికి మా కృతజ్ఞతలు. ఇదొక మంచి పరిణామం' అని అన్నారు. 

దామోదర ప్రసాద్ మాట్లాడుతూ..' సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. 15 రోజుల క్రితం నిర్మాతలతో మీటింగ్ పెట్టి గ్రౌండ్ రియాలిటీ చెప్పాం. నిర్మాతలు సహకరిస్తున్నారు. రవితేజ ఈగల్ సినిమా నిర్మాతలకు థాంక్స్' అని అన్నారు. కాగా.. సంక్రాంతి రేసులో మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్, ప్రశాంత వర్మ హనుమాన్, నాగార్జున మూవీ నాసామిరంగ రిలీజ్ కానున్నాయి. రవితేజ పోటీ నుంచి తప్పుకోవడంతో నాలుగు చిత్రాలు బరిలో నిలిచాయి. 

>
మరిన్ని వార్తలు