Actress Mythili: ఆమె కోసం కొట్టేవాడు.. అందుకే ఆత్మహత్యాయత్నం: టీవీ నటి

1 Jun, 2022 14:03 IST|Sakshi

Mythili Sridhar Reddy: ప్రముఖ టీవీ నటి మైథిలి తన భర్తపై, పోలీసులపై ఆరోపణలు చేసింది. ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రధాన కారణం తన భర్తను భరించలేకపోవడమేనని తెలిపింది. మైథిలి సోమవారం (మే 30) పంజాగుట్ట పోలీసులకు ఫోన్‌ చేసిన అనంతరం సూసైడ్‌ అటెంప్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైథిలి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ క్రమంలో తన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు, తాను అనుభవించిన మనోవేదనను చెప్పుకొచ్చింది. 

''నా భర్త సామ శ్రీధర్ రెడ్డి ఓ మహిళ ప్రోగ్రాం డైరెక్టర్. మాది పెద్దలు కుదిర్చిన వివాహం ఇది మా ఇద్దరికీ సెకండ్ మ్యారేజ్. అప్పటికే నాకు ఒక బాబు ఉన్నాడు. పెళ్లికి ముందు చాలా మంచివాడిలా నటించాడు. మనకు ఇక పిల్లలు వద్దు ఈ బాబుని నా కొడుకులాగా చూసుకుంటా అన్నాడు. కానీ పెళ్లైన కొద్ది నెలల్లోనే తన రంగులు ఒక్కోటి చూపించాడు. మహా అలియాస్ రజిత అనే అమ్మాయితో తనకు ముందునుంచే రిలేషన్ ఉంది. తన విషయంలో గొడవలు కూడా జరిగాయి. ఆ అమ్మాయి విషయంలో నన్ను కొట్టే వాడు. కట్నం డబ్బు, కారు, బంగారం ప్రతి విషయంలో అబద్ధాలు చెప్తూ మోసం చేసాడు. సొంత భర్తే 65 తులాల బంగారం దొంగతనం చేస్తే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి. నిత్యం గోడవలు జరిగేవి, కొట్టేవాడు. రజితను ఒక సారి ఫ్రెండ్ అంటాడు. మరోసారి దూరం చుట్టం అంటాడు.

రజిత మా ఇంటికొచ్చి మా మధ్య పెత్తనం చేసేది. మోతే పోలీస్ స్టేషన్‌లో తన మీద ఐపీసీ సెక్షన్‌ 498 కింద కేసు పెట్టాము. 2021 సెప్టెంబర్‌లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఇంకో కేసు పెట్టా. పంజాగుట్ట పోలీస్‌లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. శ్రీధర్ రెడ్డికి పీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీత రావు సపోర్ట్ ఉంది. సొంత భర్తే నన్ను మోసం చేసాడు. దాదాపు రెండేళ్లుగా నాతో ఉండట్లేదు. నాకు తెలీకుండానే డివోర్స్‌కు అప్లై చేసాడు. పిల్లలు ఉన్నారని ఇన్ని రోజులు అన్ని భరించాను. నాకు ఇక మానసికంగా ధైర్యం సరిపోలేదు. ఆ బాధను తట్టుకోలేకే పంజాగుట్ట పోలీసులకు పోన్‌ చేశాను. తర్వాత సూసైడ్ అటెంప్ట్‌ చేశాను. నాకు తగిన న్యాయం కావాలి. మోసం చేసిన నా భర్తను శిక్షించాలి.'' అని ఆవేదన వ్యక్తం చేసింది మైథిలి. 

మరిన్ని వార్తలు