Mahesh Babu: తండ్రి కృష్ణ తొలి వర్థంతి.. మహేశ్ మంచిపని

16 Nov, 2023 16:32 IST|Sakshi

మహేశ్ బాబు పేరు చెప్పగానే మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ గుర్తొస్తాయి. ఊరు దత్తత తీసుకోవడం, వ్యవసాయం చేయడం లాంటి సందేశాల్ని సినిమాల ద్వారా ఇస్తూ హిట్స్ కొట్టేస్తున్నాడు. మరోవైపు 'గుంటూరు కారం' లాంటి మాస్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్న మహేశ్.. ఇప్పుడు మరో మంచిపనికి శ్రీకారం చుట్టాడు.

తెలుగు హీరోల్లో మహేశ్ కాస్త డిఫరెంట్. అయితే సినిమా షూటింగ్ లేదంటే ఫ్యామిలీతో టూర్స్ వేస్తుంటాడు. వీటికి మధ్యలో యాడ్స్ చేస్తూ బిజీబిజీగా ఉంటాడు. ఇవన్నీ పక్కనబెడితే ఎంబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 2500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించాడు. అలానే తన సొంతూరు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని.. ఆ ఊరి బాగోగులు చూసుకుంటున్నాడు.

(ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌: నా ప్రైజ్‌ మనీలో వాళ్లే రూ. 27 లక్షలు తీసుకున్నారు: వీజే సన్నీ)

తాజాగా తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ తొలి వర్థంతి సందర్భంగా ఓ మంచిపని మొదలుపెట్టాడు. దాదాపు 40 మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు అయ్యే ఖర్చంతా.. ఎంబీ ఫౌండేషన్ సమకూరుస్తుందని చెప్పారు. తాజాగా 'ఎడ్యుకేషనల్ ఫండ్' పేరుతో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ లాంచ్ చేశాడు. ఈ క్రమంలో విద్యార్థులంతా మహేశ్ గర్వంగా ఫీలయ్యేలా చేస్తామని అన్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో కలిసి పనిచేస్తాడు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత జక్కన్న చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. కాకపోతే ఈ మూవీ రిలీజ్ కావడానికి మరో మూడు-నాలుగేళ్లు ఈజీగా పడుతుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)

మరిన్ని వార్తలు