Urvashi Dholakia: మహారాణిలా బతకాలనుకున్నా.. 18 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి, పిల్లలు, విడాకులు..

15 Dec, 2023 12:30 IST|Sakshi

కొన్నిసార్లు కష్టాలే మనకు గమ్యాన్ని చూపిస్తాయి. ఆ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ధైర్యం కూడదీసుకుని గమ్యం వైపు అడుగులు వేస్తూ పోవాల్సిందే! తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది బుల్లితెర నటి ఊర్వశి ఢోలకియా. తనకు ఎదురైన కష్టాల వల్లే కెమెరా ముందు నటిస్తున్నానంటోంది. తాజాగా ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న బాధాకర సంఘటనలను చెప్పుకొచ్చింది. 'నేను అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను. ప్రేమ- పెళ్లి కోసం కల కన్నాను. అసలు పని చేయకూడదని అనుకున్నాను. ఒక మహారాణిలా బతకాలనుకున్నాను. కానీ అమ్మ  ఎప్పుడూ ఒక మాట చెప్తుండేది. నువ్వు స్వతంత్రంగా జీవించు.. కానీ తప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిందే అని!

విడాకులు అదే ప్రధాన కారణం..
అప్పుడు నాకు 16 ఏళ్ల వయసు.. పెద్దగా లోకజ్ఞానం కూడా లేదు. పెళ్లి చేశారు. 17 ఏళ్లకే కవలలు పుట్టారు. 18 ఏళ్లకు విడాకులు కూడా తీసుకున్నాం. విడాకులకు ప్రధాన కారణం.. అతడు బాధ్యతగా ఉండకపోవడమే! అతడిలా నేను పిల్లలను అనాథల్లా వదిలేయలేను కదా.. ఆ సమయంలో నా పేరెంట్స్‌ సపోర్ట్‌ చేసినంతగా మరెవరూ అండగా నిలబడలేదు. కానీ నేను, నా పిల్లలు వారికి భారం కాకూడదనే 19 ఏళ్ల వయసులో పని కోసం తిరిగాను. కానీ ఇండస్ట్రీలో అవకాశాలు అందిపుచ్చుకోవడం అంత సులభమేమీ కాదు. చాలామంది నా పరిస్థితిని అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని చూశారు. చాలా తక్కువ డబ్బులిచ్చేవారు.

నాన్న ఎక్కడ? అని పిల్లలు అడగలేదు..
విడాకుల తర్వాత ఇంతవరకు మళ్లీ నా మాజీ భర్తతో మాట్లాడనేలేదు. అతడి గురించి పిల్లలకు చెప్పాలనుకున్నా వాళ్లు వద్దని వారించేవారు' అని చెప్పుకొచ్చింది. కాగా ఊర్వశి ఆరేళ్ల వయసులో లక్స్‌ వాణిజ్య ప్రకటనలో నటించింది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పలు సీరియల్స్‌ చేసిన ఈమె హిందీ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచింది. దాదాపు ఏడు సంవత్సరాల పాటు సాగిన ప్రముఖ హిందీ సీరియల్‌ 'కసౌటి జిందగీకే' సీరియల్‌లో ముఖ్య పాత్రలో అలరించింది.

A post shared by URVASHI (@urvashidholakia)

చదవండి: అమర్‌ను మళ్లీ టార్గెట్‌ చేసిన శివాజీ.. వెధవ.. ఏం రోగమంటూ..

>
మరిన్ని వార్తలు