చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు.. ప్రాణాలు పోతాయి జాగ్రత్త: దర్శకుడు ఎమోషనల్‌ పోస్ట్‌

7 Nov, 2023 21:00 IST|Sakshi

టాలీవుడ్‌ డైరెక్టర్ వెంకీ కుడుముల టాలీవుడ్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలతో పాటు ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చిన్న తప్పుతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం వెంకీ కుడుముల చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం. 

(ఇది చదవండి: రష్మిక వీడియోలానే మరో స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!)

ట్వీట్‌లో వెంకీ రాస్తూ..' కొన్ని వారాలుగా మా కజిన్‌ జ్వరంతో బాధపడుతున్నారు. అది సాధారణ జ్వరమేనని అనుకున్నారు. దీంతో టైముకి వైద్యుని వద్దకు వెళ్లలేదు. అది కాస్తా అరుదైన జీబీ సిండ్రోమ్‌కు (మనిషిలోని రోగనిరోధకశక్తి అదుపు తప్పి నరాలపై దాడి చేయటం) దారి తీసింది. సరైన సమయంలో చికిత్స తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదు. ఆలస్యం చేయడం వల్లే జీవితాన్ని కోల్పోవాల్సి  వచ్చింది. నిర్లక్ష్యం మా కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చింది. కొవిడ్‌ తర్వాత జ్వరాన్ని కూడా తేలికగా తీసుకుంటున్నారు. దయచేసి అలా చేయొద్దు. జ్వరం వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇలాంటి చిన్న జాగ్రత్తలే మన ప్రాణాలు కాపాడతాయి.'అని రాసుకొచ్చారు.

కాగా.. వెంకీ ప్రస్తుతం నితిన్‌తో ఇటీవల సినిమాను ప్రకటించారు. భీష్మ’ తర్వాత నితిన్‌ - రష్మిక కాంబోలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: అశ్వినిని ఏడిపించేసిన బిగ్ బాస్.. హౌస్‌లో ఏం జరిగిందంటే?)

మరిన్ని వార్తలు