సరికొత్త కాన్సెప్ట్‌తో ‘రత్తం’.. డబ్బింగ్‌ ప్రారంభం 

24 Apr, 2022 11:00 IST|Sakshi

రత్తం చిత్ర డబ్బింగ్‌ శనివారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. ఆయనకు జంటగా మహిమా నంబియార్, నందితా శ్వేత, రమ్యా నంబీశన్‌ మొదలగు ముగ్గురు నాయికలు నటిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్‌ పతాకంపై కమల్‌ బొహ్రా, లలిత ధనుంజయ్, బి.ప్రదీప్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి.ఎస్‌.అముదన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

(చదవండి: అప్పుడు చాలా అవమానంగా అనిపించింది: చిరంజీవి)

సరికొత్త కాన్సెప్ట్‌తో ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్రం షూటింగ్‌ను ప్రణాళిక ప్రకారం రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.  ఇండియాలోని ప్రధాన ప్రాంతాల్లో కొంతభాగం పూర్తి చేసుకుందని,  మిగిలిన భాగాన్ని త్వరలో విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు పేర్కొన్నారు. మరోపక్క డబ్బింగ్‌  పార్ట్‌ను శనివారం ప్రారంభించినట్లు చెప్పారు. దీనికి కన్నన్‌ సంగీతాన్ని, గోపి అమర్‌నాథ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు