కాజల్‌ ఇంట్లో హల్దీ వేడుక.. ఫోటోలు వైరల్‌

29 Oct, 2020 18:55 IST|Sakshi

మరికొన్ని గంటల్లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తన బ్యాచిలర్‌ జీవితానికి గుడ్‌బై చెప్పనున్నారు.  రేపు చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అక్టోబర్‌ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్‌ కిచ్లును వివాహమాడనున్న విషయం తెలిసిందే. పెళ్లి పనులన్నీ కాజల్‌ సోదరి నిషా అగర్వాల్‌ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే కాజల్‌ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా బుధవారం మెహెందీ ఫంక్షన్‌ నిర్వహించగా.. నేడు(గురువారం) హల్దీ, వేడుకలను నిర్వహించారు. పసుపు రంగు దుస్తులు, పువ్వుల రూపంలో ఏర్పాటు చేసిన జ్యూవెల్లరీతో కాజల్‌ నిజంగా చందమామలా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి : మెహందీ వేడుక అయిపోంది.. ఇవాళ హల్ది ఫంక్షన్‌

కాగా కాజల్‌ హల్దీ ఫోటోలను ఆమె అభిమానులు రీపోస్టు చేస్తూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా కోవిడ్‌ నేపథ్యంలో కాజల్‌ తన వివాహాన్ని నిడారంబరంగా జరుపుకోబుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య ముంబైలో ఈ వేడుక జరగనుంది. ఇక తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కాజల్‌ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. ఇకముందు కూడా తనను ఆదరిస్తారిస్తారని ఆకాంక్షిస్తున్నానని కాజల్‌ పేర్కొంది

@kajalaggarwalofficial 's haldi ceremony... 💛💛💛 Do follow and support @celebrity_corner_official . . . . #kajal #kajalaggarwal #gauthamkitchlu #kajgautkitched

A post shared by Celebrity corner (@celebrity_corner_official) on

మరిన్ని వార్తలు