రష్మిక కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేస్తూ 900 కి.మీ ప్రయాణం

24 Jun, 2021 10:20 IST|Sakshi

సినీ హీరో, హీరోయిన్లపైన అభిమానులు చూపే ప్రేమ అంత, ఇంత కాదు. వారికి ప్రాణంగా ప్రేమించే అభిమానులు చాలానే ఉంటారు. తమకు నచ్చిన హీరో, హీరోయిన్లను వెండితెరపై చూస్తేనే పండగ చేసుకునే ఫ్యాన్స్‌... ఇక వారిని ప్రత్యేక్షంగా చూస్తే.. వారి ఆనందానికి అవధులు ఉండవు. జీవితంలో ఒక్కసారైనా తమ ఫెవరెట్‌ హీరో, హీరోయిన్లను ప్రత్యేక్షంగా చూడాలని, సెల్ఫీ దిగాలని అనుకుంటారు. అవకాశం వస్తే వెళ్లి నేరుగా కలుస్తారు. కానీ పనిగట్టుకొని వారికోసం అయితే వెతకరు. అయితే అభిమానుల్లో కాస్త అతి చేసే వాళ్లు కూడా ఉంటారు. తాజాగా రష్మిక ఫ్యాన్  ఒకరు అలాంటి పనే చేశాడు. ఎప్పుడూ తెరమీదేనా.. ఓ సారి రియల్‌గా చూద్దాం అనుకున్నాడో ఏమో.. ఆమెను కలిసేందుకు ఓ అభిమాని ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేశాడు.

వివరాల్లోకి వెళితే... తెలంగాణకు చెందిన ఆకాశ్‌ త్రిపాఠి.. రష్మికకు వీరాభిమాని. ఆమెను ఎలాగైనా కలుసుకోవాలనుకున్నాడు. గూగుల్‌ ద్వారా ఆమె స్వస్థలం కర్ణాటకలోని కొడగు సమీపంలోని విరాజ్‌పేట అని తెలుసుకున్నాడు. రైల్లో మైసూరుకు వెళ్లాడు. . ఆ తర్వాత సరకు రవాణా చేసే ఆటో ద్వారా రష్మిక స్వస్థలానికి చేరుకున్నాడు. అయితే అక్కడికి చేరుకున్నాక హీరోయిన్ రష్మిక ఇల్లు ఎక్కడ అంటూ… కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగాడు. అతడి ప్రవర్తన తేడాగా అనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు..  రష్మిక ​ షూటింగ్​ కోసం ముంబై వెళ్లిందని సదరు వ్యక్తిని వెనక్కిపంపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు