మీనా కూతురుని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో.. ఫోటోలు వైరల్‌

19 Sep, 2021 12:57 IST|Sakshi

అందాల నటి మీనా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బాల‌న‌టిగా ఎంట్రీ ఇచ్చి,  తన అందచందాలతో, చక్కటి అభినయంతో చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచుకుంది.  ఇప్పటికే అదే సౌందర్యంతో చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్నారు మీనా. 

మీనా 1976 సెప్టెంబ‌ర్ 16న మ‌ద్రాసులో జ‌న్మించారు. 2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని మీనా వివాహం చేసుకుంది. వీరికి 2011లో నైనికా అనే ఓ అమ్మాయి పుట్టింది.

శుక్రవారం (సెప్టెంబర్‌ 16) మీనా తన 45వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన కూతురితో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది మీనా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మీనా కూతురు అచ్చం తల్లి లాగే ఉందంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

విజయ్‌ హీరోగా నటించిన ‘పోలీసోడు’చిత్రంలో అతనికి కూతురిగా నటించింది నైనిక. ఆ తర్వాత ‘భాస్కర్‌ ఒరు రాస్కెల్‌’లో అరవింద్‌ స్వామితోనూ నటించింది. 

ఇక మీనా విషయానికొస్తే శివాజీ గ‌ణేశ‌న్ న‌టించిన నెంజ‌న్ గ‌ళ్ చిత్రంలో తొలిసారి మీనా తెర‌పై క‌నిపించారు. తెలుగులో మీనా మొద‌టిసారి క‌నిపించిన చిత్రం కృష్ణ హీరోగా రూపొందిన సిరిపురం మొన‌గాడు. తెలుగులో వెంకటేష్, చిరంజీవి, నాగార్జున ఇలా అందరితో ఆడిపాడింది.

రెండో ఇన్నింగ్స్ షురూ చేశాక వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ 'అన్నాత్తే'లో నటిస్తుంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న దృశ్యం- 2 సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు