-

Apple iPhone 14 series: ఐఫోన్-14 ఫీచర్స్​ లీక్.. మాములుగా లేవుగా!

19 Sep, 2021 12:58 IST|Sakshi

గత వారం యాపిల్‌ దిగ్గజం విడుదల చేసిన ఐఫోన్‌ 13 సిరీస్‌ మోడల్‌ ఫోన్‌ అమ్మకాలు సెప్టెంబర్‌ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌ ఫీచర్లు లీక్‌ అయ్యాయి.దీంతో ఐఫోన్‌ 14సిరీస్‌ గురించి చర్చ మొదలైంది.ఐఫోన్‌ 14మోడల్‌ ఫోన్లు ఎప్పుడు విడుదలవుతాయి.వాటి ధరలు ఎలా ఉంటాయి. ఏఏ ఫీచర్లు ఉండనున్నాయి. అనే అంశం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.    

    

ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌  ఫీచర్స్‌
చైనాలో యాపిల్‌ ఐఫోన్‌ అమ్మకాలు జరిపే  సంస్థల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఆ దేశానికి చెందిన టెక్నాలజీ బ్లాగ్‌ 'గిజ్‌చైనా' కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..2022లో ఐఫోన్‌ 14 సిరీస్‌ మోడల్‌ ఫోన్లు కనీసం మూడు మోడల్‌ ఫోన్లను యాపిల్‌ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది విడుదల కావాల్సిన యాపిల్‌ 14సిరీస్‌లోని ఓ మోడల్‌ ఫోన్‌ 120హెచ్‌జెడ్‌ డిస్‌ప్లే, మరో ఫోన్‌ 60హెచ్‌జెడ్‌ ఎల్‌టిపిఎస్ ఓఎల్‌ఇడి డిస్‌ప్లేతో రానుంది. ఇదే నిజమైతే ఐఫోన్ 14 సిరీస్ బేసిక్‌ ఫోన్‌ ఐఫోన్ 14 మినీ 60హెచ్‌ స్క్రీన్‌తో విడుదల కానుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఐఫోన్‌ 13 ధరల కంటే ఐఫోన్‌ 14సిరీస్‌ ఫోన్ తక్కువ ధరకే లభ్యం కానుంది. 

ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌ విడుదల ఎప్పుడంటే ?
యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ 14మోడల్‌ ఫోన్లను 2022లో విడుదల చేస్తుందని చైనా టెక్‌ బ్లాగ్‌ తన కథనంలో పేర్కొంది. అయితే  2022లో ఐఫోన్ 14 సిరీస్‌తో వచ్చే ఫీచర్లు గురించి ఇప్పుడే కాదు. గతంలో సైతం విడుదలైన నివేదికల్లో  ఐఫోన్ 14 మాక్స్‌ విడుదల చేసినా ఐఫోన్ 14 మినీని విడుదల చేయకపోవచ్చనే నివేదికలు సూచించాయి. అది అయిపోతే, ఐఫోన్ 14 ,ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మాక్స్,ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడళ్లతో విడుదల కానుంది. ఐఫోన్ 14 మోడల్స్ ఆపిల్ ఏ16 చిప్‌సెట్,ప్రొటెక్ట్‌ కోసం ఫేస్‌ఐడీ, టచ్‌ ఐడి ఫీచర్లతో ఐఫోన్‌ 14 విడుదల కానుందనే ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతుండగా..ఐఫోన్‌ 14ఫోన్‌ మోడళ్ల  ఎల్‌టీపీఓ (A low-temperature polycrystalline oxide (LTPO) display )  డిస్‌ ప్లే తయారీ కోసం ఎల్జీ యాపిల్‌తో చేతులు కలపనుంది. 

చదవండి: ఐఫోన్‌ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో..

మరిన్ని వార్తలు